ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 52వ రోజు శుక్రవారం ఒంగోలులోని రంగు తోట శివాజీ బొమ్మ ప్రాంతంలో 12వ డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కటకం శెట్టి ఆధ్వర్యంలో జనసైనికులు పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులతో వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈసారి అవకాశం ఇస్తామన్నారు.