ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మహిళలకు అందించే సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని టిడిపి ఇన్చార్జ్ మొత్తముల అశోక్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.