సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలపై పని భారాన్ని తగ్గించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల కళ్యాణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె చీరాలలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వివిధ రకాలైన ఆన్లైన్ ఆప్ లతో సతమతమవుతున్నామని చెప్పారు. రెగ్యులర్ ఏఎన్ఎంలు మాదిరే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ జీతాలు సమానంగా లేవన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతామని కళ్యాణి హెచ్చరించారు.