కారంచేడు మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం పై శుక్రవారం విచారణ జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విచారణ జరిగింది. చీరాల డివిజనల్ పంచాయతీ అధికారి వెంకట్రావు ఈ విచారణ నిర్వహించారు. విచారణలో భాగంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు పూర్తి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ కి నివేదిక పంపుతామని డివిజనల్ పంచాయతీ అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa