రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలులో జరుగుతున్న రేషన్ పంపిణీ వాహనాన్ని తనిఖీ చేశారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎండియూ ఆపరేటర్లను, డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫలాల శాఖ డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.