ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన జాతీయ ప్రతిభ ఉపకార వేతన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఈనెల 3న జరుగుతుందని డీఈఓ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. 3, 826 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ లో ఉంచినట్లు తెలిపారు.