గత తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ప్రో కబడ్డీ లీగ్ శనివారం నుంచి 10వ సీజన్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa