ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు.
రెండు రోజుల క్రితం ఛోటే బేతియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కదండి పంచాయతీ ఉపసర్పంచ్ రాము కచలామీ(45) తన ఇంటి వద్ద నిద్రిస్తుండగా మావోయిస్టులు హత్య చేశారు.
అనంతరం నరికి హత్య చేసి గ్రామ శివారులో మృతదేహాన్ని పడేశారు. అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం నలుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు.