ఉగాండాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. సఫీనా నముక్వాయ (70) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఆమెకు బుధవారం సిజేరియన్ ద్వారా ఓ బాబు, పాప పుట్టారు. ఉగాండా రాజధాని కంపాలా నగరంలోని ఆసుపత్రిలో కాన్పు జరిగింది.
‘ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా మాట్లాడుతూ, నడుస్తున్నారు. ఇక్కడే ఐవీఎఫ్ చికిత్స కూడా పొందారు’ అని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఆర్థర్ మ్యాట్సికో శుక్రవారం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa