బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో భారీ భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌లోని రామ్‌గంజ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. రామ్‌గంజ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. నిమిషాల వ్యవధిలో చిట్టగాంగ్ ప్రావిన్స్‌లోని లక్ష్మీపూర్, చాంద్‌పూర్, కొమిల్లాలో భూమి కంపించిందని పేర్కొంది.
అదేవిధంగా రాజ్‌షాహి, సిల్హెట్, ఢాకా, నొవాఖలి, కుష్తియాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. అయితే 5.5 తీవ్రతతో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మొలాజికల్ సెంటర్ తెలిపింది. రామ్‌గంజ్‌తోపాటు లక్ష్మీపూర్, చిట్టగాంగ్‌లో కూడా భూమి కపించిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది.