మంత్రాలయంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం ముగిసింది. నవంబర్ నెలకు సంబంధించిన హుండీ ఆదాయం రూ. 2, 86, 43, 454 వచ్చింది. ఇందులో కరెన్సీ రూ. 2, 79, 66, 554, నాణేలు రూ. 6, 76, 900 వచ్చింది. బంగారం 62 గ్రాములు, వెండి 1934 గ్రాములను భక్తులు సమర్పించారు.