డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో పందుల బెడద ఎక్కువగా ఉందని పోలీస్ స్టేషన్ చేరింది పంచాయతీ. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేషనల్ హైవే పక్కనే ఉన్న గ్రామంలో సంవత్సరం నుంచి పందుల సమస్య ఎక్కువగా ఉందని, దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ పెద్ద ఉప్పరి రామాంజనేయులు, గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టడంతో, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.