భారత్, స్వీడన్ శుక్రవారం లీడ్‌ఐటి 2.0ని ప్రారంభించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిశ్రమలను అభివృద్ధి చేయడం, తక్కువ కార్బన్ టెక్నాలజీని అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం.
దుబాయ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో లీడ్‌ఐటీ సెషన్‌లో నరేంద్ర మోదీ మాట్లాడారు. కాలుష్య ఉద్గారాలను సున్నాకి తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఉండాలని అన్నారు.