అనంతపురం జిల్లా ఉవరకొండ నియోజకవర్గంలో 9,185 మంది ఓటర్లపై వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల పంచాయతీలో పలువురు పెళ్లికాని యువతులకు వివాహమైనట్లు నిర్ధారించి, ఓటరు జాబితా నుంచి పేరును తొలగిస్తున్నామని అధికారులు ఫాం- బి నోటీసులు ఇచ్చారు. ఇదే గ్రామంలో అమీనా, లావణ్య అనే మహిళలకు కూడా ఆయన ఫిర్యాదుతో పెళ్లికాకున్నాఅయినట్లు నోటీసులు ఇచ్చారు. వజ్రకరూరు మండలంలో మొత్తం 1,665 మంది ఓటర్లపై ఆయన ఫిర్యాదు చేశారు. వీరిలో మరణించినవారు 544 మంది ఉన్నారని, వలస వెళ్లినవారు, పెళ్లి చేసుకుని వెళ్లిపోయినవారు ఉన్నారని నోటీసులు వచ్చాయి. ఇందులో బతికున్నవారు, అవివాహితులకూ నోటీసులు అందడంతో అవాక్కవుతున్నారు. మండలంలో టీడీపీకీ మెజార్టీ వచ్చే కొనకొండ్ల, చాయాపురం, కడమలకుంట, వెంకటాంపల్లి గ్రామాల్లో ఆ పార్టీ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇచ్చారు.