బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని ఓటర్లకు నోటీసులు అందుతున్నాయి. మండలంలోని కూకట్లపల్లి, వెలమవారిపాలెం, గొర్రెపాడు, మరికొన్ని గ్రామాల్లో ఓటర్లకు గత రెండు రోజులుగా రిజిస్టర్ పోస్టు ద్వారా వందల సంఖ్యలో నోటీసులు వచ్చాయి. వీటిని చూసిన గ్రామీణ ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో ఉన్న ఓటర్లకూ, మీకు పోలికలు ఉన్నాయని కూకట్లపల్లి గ్రామంలో 35మందికి పోస్టు ద్వారా నోటీసులు పంపారు. దీనిపై తహసీల్దార్ కె.రవిబాబు మాట్లాడుతూ... శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.