ఓటర్ల జాబితాలో సవరణలు, నమోదుకు సంబంధించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు తహసీల్దార్లకు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నంద్యాల, దొర్నిపాడు మండలాల్లో ఒకే ఇంట్లో 10 ఓట్లకు మించి ఉన్న కుటుంబాల్లో ఈసీ ఆదేశాల మేరకు ఓటర్ల తొలగింపునకు చర్యలు తీసుకోవడంలో అశ్రద్ధ వహించినట్లు స్పష్టం కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులుతో పాటు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, దొర్నిపాడు తహసీల్దార్ జయప్రసాద్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.