’100 కోట్ల బడ్జెట్తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని వైసీపీ నేతలు తెలిపారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని కోరారు.