ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం,,,,కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 05:48 PM

ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తుఫాన్ అలర్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటుచేశారు. తుఫాన్ సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో 1వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్‌ మోకా వెంకట రామారావు తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు.


తుఫాన్ నష్ట నివారణ, సహాయక చర్యలపై ఒంగోలులోని కలెక్టరేట్‌తో పాటు, మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబరు:1077, ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో 88866 16044 ఏర్పాటు చేశారు. ఎలాంటి విద్యుత్తు సమస్యలున్నా ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం ఆ శాఖ కంట్రోల్‌ రూం ఒంగోలు:73827 88433 అందుబాటులో ఉంచారు. బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌లో ఫోన్‌ నంబరు 8712655881 ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని.. ఎలాంటి సాయం కోసమైనా సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో విద్యుత్తు సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌.శ్రీనివాసరావు సూచించారు. విద్యుత్తు తీగలు తెగిపోవడం, చెట్లు పడిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజులు పోవడం తదితర సమస్యలు ఉంటే జాగ్రత్తలు వహించి విద్యుత్తు అధికారులకు తెలియజేయాలన్నారు. నరసరావుపేట డివిజన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1912 లేదా కంట్రోల్‌రూం నంబరు 9491052195కు సమాచారం ఇవ్వాలన్నారు.


ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి


కలెక్టరేట్‌: 1077


ఎస్పీ కార్యాలయం: 100, 9392903413


నెల్లూరు : 94408 17470


కావలి : 79010 56437


నెల్లూరు రూరల్‌ : 89199 87020


కోవూరు : 79010 56437


ఆత్మకూరు : 79010 56806


నాయుడుపేట : 73826 23178


గూడూరు : 79010 36852


విద్యుత్తుశాఖ (డివిజన్ల వారీగా)


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.


కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు కలెక్టరేట్‌ - 18004253077


కాకినాడ ఆర్డీవో కార్యాలయం: 8008803208


పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం: 9603663227


అంతేకాదు తీర ప్రాంత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చిరకలతో దక్షిణమధ్య రైల్వే 142 రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఆదివారం నుంచి బుధవారం వరకు వర్షాలు తప్పవంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com