ధర్మవరం పట్టణం డీలర్ కాలనీ వద్ద శనివారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న యువకుడిని పోలీసులు ఆదివారం గుర్తించారు. ధర్మవరం పట్టణం రాజేంద్రనగర్ కు చెందిన రమణ కుమార్ గా గుర్తించారు. బాధితుడి తల్లి శారదమ్మ తెలిపిన వివరాల మేరకు. రమణ కుమార్ కూలికి మగ్గం నేస్తుంటాడని తెలిపారు. కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగాలేదని, శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.