తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో పక్క రాష్ట్రంలో ఒక్క చోట కూడా పోటీ చేయని టీడీపీ పార్టీ హడావుడి చేయడం పట్ల వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించింది. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.