నారా పులకేశ్ తనకు తాను పెద్ద మహానాయకుడిగా ఊహించుకుని మమ్మల్ని అవినీతిపరులని బ్రాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అయన మాట్లాడుతూ..... 2014–19 మధ్య వాళ్ల నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ మజ్జిగదగ్గర మొదలుకుని, అనకాపల్లి బెల్లం నుంచి, అమరావతి భూముల దాకా అడ్డగోలుగా దోచుకు తిని చివరికి ప్రధాని మోదీగారే చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చేశాడని సర్టిఫికేట్ తెచ్చుకున్న వాడు ఇక్కడకొచ్చి మమ్మల్ని అవినీతిపరులని మాట్లాడుతున్నాడు. అంటే, దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా లోకేశ్ వ్యవహారశైలిని అర్ధం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల క్యారెక్టర్లపై మరకలేసి జగన్మోహన్రెడ్డి గారి పక్షానున్న వారంతా అవినీతిపరులేనని చెప్పగానే.. టీడీపీ వారంతా మహానుభావులవుతారని వాళ్లకు వాళ్లే బిల్డప్ ఇచ్చుకునే ఎత్తుగడ ఇది. రాజకీయ అవగాహనలేని దద్దమ్మ లోకేశ్.. నీ బిల్డప్పులకు పప్పులుడికే రోజులు కావివి అని హెచ్చరించారు.