కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి అందని ద్రాక్షలానే మారాయి. ఈ ఎన్నికల ఫలితాలతో కర్నాటక ప్రభుత్వం నుంచి వైదొలిగిన తరువాత, తెలంగాణతో బీజేపీ దక్షిణ భారతదేశంలోకి చొచ్చుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ నేతలు వాదన. నిజానికి పది రాష్ట్రాల హిందీ పార్టీగా బీజేపీ మారిపోయింది. ఈ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్, హర్యానా, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఢిల్లీ ఉన్నాయి. పొరుగున ఉన్న పంజాబ్‌లో కూడా బీజేపీ ఉనికిలో లేదు.
అధికారానికి బీజేపీ దూరంగా…:బీహార్
ఆగస్ట్ 2022లో జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్ మహాకూటమికి ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీని అధికారం నుంచి తొలగించారు. 243 మంది సభ్యులున్న సభలో మహాకూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 78 మంది ఉన్నారు.
ఒడిశా : బీజేపీకి ఇంకా ప్రభుత్వం ఇవ్వని రాష్ట్రం. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 24 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేడీ పార్లమెంటులో బీజేపీకి సహాయం చేస్తోంది. అయితే రాష్ట్రంలో వారితో విభేదిస్తోంది. బీజేడీకి 112 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 23 మంది ఉన్నారు.
జార్ఖండ్ : 2019లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేతృత్వంలోని ఫ్రంట్ బీజేపీని అధికారం నుంచి దింపింది. 81 మంది సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్ : గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 68 స్థానాలకు గానూ కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఢిల్లీ :2020 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మరో ఘోర పరాజయం ఎదుర్కొంది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ ఆరుగురికి పడిపోయింది. ఈ ఏడాది జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ కత ముగిసింది.