ఆరోగ్యశ్రీ మీద విస్తృతంగా, ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదని సూచించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యాన్ని అందుకునేవారికి ఈ విషయాలన్నీ తెలియాలని ఆదేశించారు.