వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. తన పాదయాత్రలో మన సమస్యలు తెలుసుకున్న జగనన్న, అధికారంలోకి వచ్చాక ఊహించనంత వేగంగా వాటిని పరిష్కరించారు. మనం కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అందించి మన కుటుంబాల ఆర్థికస్థాయిని పెంచారు. చదువుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్రెడ్డి చలవ వల్ల, మన పిల్లలు ఈరోజు ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు. కార్పొరేట్‌స్థాయి విద్య మన పిల్లలకు అందుబాటులోకి వచ్చిందంటే అది జగనన్న ఘనతే. దోచుకో.. దాచుకో అన్నదే చంద్రబాబు ఫిలాసఫీ. ఆయన వల్ల పేదలకు జరిగిన మంచి లేదు. మనకోసం వచ్చిన నాయకుడు జగనన్న. మన మేలుకోరే నాయకుడు జగనన్న. పేదరికాన్ని గణనీయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తగ్గించారని అన్నారు.