వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ... ఈ సభకు వచ్చిన అశేష ప్రజల్ని చూస్తుంటే, అణగారిన వర్గాల్లో జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగనన్న సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్థాయిని పెంచారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ మేలు చేసిన పాలకుడు మన జగనన్న. మన భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నేను మళ్లీ సీఎం చేసుకోవాలి. చంద్రబాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ టీడీపీ వాళ్లు వస్తున్నారు. తెలుగు దేశం పార్టీకే గ్యారంటీ లేదు. నమ్మితే మోసపోయినట్టేనని ప్రజలందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబు మనకొద్దు అని పిలుపునిచ్చారు.