నైజీరియాలో తిరుగుబాటుదారులపై సైన్యం ప్రయోగించిన డ్రోన్ లక్ష్యం తప్పి సాధారణ ప్రజలపై పడింది. ఈ ఘటనలో 120 మంది మృతి చెందారు. కడునా రాష్ట్రంలోని ఇగాబిలో ఆదివారం రాత్రి మతపరమైన పండుగ జరుపుకుంటున్న వారిపై డ్రోన్ బాంబు అకస్మాత్తుగా పడింది.
సెలవు కావడంతో పండుగకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువైంది. ఇటీవల, సైన్యం ఉపయోగించే డ్రోన్లు లక్ష్యం తప్పి తరచుగా నివాస ప్రాంతాలపై పడుతున్నాయి.