మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బలహీన వర్గాల మాన, ధనః, ప్రాణాలకు విలువ లేదన్నారు. సినిమాలో విలన్ పాత్రని వైసీపీ మనుషులు పోషిస్తున్నారని విమర్శించారు. ఏపీ రాష్ట్రానికి మెయిన్ విలన్ జగన్ అని అన్నారు. బీసీలను 74 మందిని హతమార్చిన ప్రభుత్వం ఇది అని విరుచుకుపడ్డారు. రిజర్వేషన్‌లను తగ్గించడం, దళిత పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఇది అని.. చంపిన వాళ్ళే సానుభూతి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కుహనా మేధావులు అంత ప్రజల ముందుకు వస్తున్న మేరుగ నాగార్జున లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నలుగురు రెడ్ల చేతిలో రాష్ట్రం ప్రభుత్వం ఉందన్నారు. ఒకరికి ఉద్యోగం కానీ, కాంట్రాక్ట్ రావాలంటే ఎవరో ఒక రెడ్డి చెప్పాలన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని రెడ్లకు పాదాక్రాంతం చేసిన వీరా మాట్లాడేద అని అన్నారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులారా మీకు ఆత్మాభిమానం లేదా? వైసీపీ ది బస్సు యాత్ర కాదు దగాకోరుల దండయాత్ర, దండగమారి యాత్ర. ఈ వైసీపీ నయవంచలకు బుద్ది చెప్పండి. రాయదుర్గంలో సామాజిక బస్సు యాత్ర తుస్సు మనడం ఖాయం’’ అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.