బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా దివిసీమలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర పంటలు పూర్తిగా నీట మునిగాయి. బస్తాల్లోని ధాన్యం కూడా తడిసిపోయింది. వైఎస్‌ఆర్ జిల్లా కలసపాడు మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, పసుపు, మినుము, ఉలవ పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.