బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనుంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా తీరం వైపు ఉత్తర దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఒంగోలుకు 25 కి.మీ, బాపట్లకు 60 కి.మీ, మచిలీపట్నానికి 130 కి.మీ.దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మరో గంటలలోపు బాపట్ల దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మి వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.