మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుండి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు నెల్లూరు జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరం దాటిన మిచౌంగ్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి తీరాన్ని తాకిన తుఫాను.. సాయంత్రం 4 గంటలకు తీరం దాటినట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. తీవ్ర తుఫానుగా తీరం దాటి.. మరో రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపం కారణంగా సోమవారం రాత్రి నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడ జనం అంధకారంలో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
తీరంలో భీకర గాలులు
మిచౌంగ్ తుఫాను తీరాన్ని తాకడంతో సముద్రం అల్లకల్లోంగా మారింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ఎక్కడకక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తుఫాన్ ప్రభావంతో బీభత్సం. చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై టోర్నడో ఏర్పడింది. గండేపల్లి పెట్రోల్ బంక్ వద్ద సుడిగాలికి వరద నీరు పైకెగిసింది. సుడిగాలి బీభత్సానికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన తుఫాన్
మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనుందని వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ అలర్ట్..
బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ ప్రస్తుతానికి ఒంగోలుకు 25 కి.మీ, బాపట్లకు 60 కి.మీ, మచిలీపట్నానికి 130కి.మీ. దూరంలో ఉంది. మరికొన్ని గంటల్లో తుఫాన్ బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటనుంది. మిచౌంగ్ తీరం ప్రభావంతో వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు