బాలికలు, మహిళలకు దిశ యాప్ శ్రీరామరక్షగా నిలుస్తోందని ఎస్ఐ శర త్చంద్ర పేర్కొన్నారు. జూటూరులోని కేజీ బీవీలో మంగళవారం ఆయన విద్యార్థినులకు దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్ ను ఆవిష్కరించిందన్నారు. దీంతో ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పోలీసుల సాయం అందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.