చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. హైదరాబాద్ లో ఓటు వేసిన వారు ఏపీ లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో ఓటర్లకు సంబంధించి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేస్తున్నారని తెలియచేశారు.ఇందుకోసం టిడిపి అదినేత చంద్రబాబు ఆదేశాలమేరకు హైదరాబాద్ ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు. పచ్చి అవకాశ వాది అయిన చంద్రబాబు దుర్బుధ్దితో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు నపుంసకుల్లా మాట్లాడుతున్నారు.తెలంగాణ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమీషన్ కలెక్టర్ల కు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరారు.