కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని కాలనీకి చెందిన మేఘన అనే యువతి అదృశ్యమై నట్లు కేసు నమోదైంది. గద్వాల జిల్లా వనపర్తి మండలానికి చెందిన మేఘన తన మేనమామ అర్జున ఇంట్లో ఉంటూ టైలరింగ్, నర్సరీ పనులు నేర్చుకుంటోంది. నెల 2వ తేదీ నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అర్జున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.