గుంతకల్లు పట్టణంలోని 31వ వార్డు మస్తాన్ పేటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆ వార్డు కౌన్సిలర్ నగేష్ తో కలిసి వార్డులో పర్యటించారు. తాగునీరు సమస్య ఉన్నదని ప్రజలు చెప్పడంతో ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతో పాటు మున్సిపల్ ఇంజనీరు గురప్ప యాదవ్, అసిస్టెంట్ ఇంజనీరు, సచివాలయం కార్యదర్శులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa