తిరుమలలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో.. వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్‌లు నిండిపోయాయి.. జలపాతాలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. అలాగే అలా కొండలపై నుంచి నీళ్లు కిందకు జాలువారుతుంటే అద్భుతంగా ఉంది. అలాగే శేషాచలం అడవి, ఏడుకొండలపై ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.. ఈ అద్భుతాన్ని చూసి భక్తులు మైమరిచిపోతున్నారు.
తిరుమల కొండపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. కలియుగ వైకుంఠంమైన ఏడుకొండలలో నుంచి జాలువారిన ఒక జలదార స్వామి వారి మూడు నామాలతో భక్తులకు ప్రత్యక్షoగా కనువిందు చేస్తోంది. సప్త గిరులలో ఈ అద్భుతాన్ని చూసి భక్తులు సరికొత్త అనుభూతినిపొందుతున్నారు. నిజంగా స్వామివారి మహిమే అంటున్నారు కొందరు భక్తులు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
తిరుమల కొండల మధ్య అద్భుత దృశ్యం
అలా కొండపై నుంచి పరవళ్లు తొక్కుతున్న నీళ్లు చూసేందుకు ఎంత సుందరంగా కనిపిస్తోందో అంటున్నారు భక్తులు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు.. ఈ జలపాతాలను చూసి ఆనందంతో పరవశించిపోతున్నారు. కొండ పైనుంచి జాలువారుతున్న ఆ మూడు జలపాతాలు చూసేందుకు అచ్చం తిరునామంలా ఉందంటున్నారు. ఓ భక్తుడు జలపాతాల వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో మూడు రోజులుగా తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కురుస్తూనే ఉంండటంతో ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, కాటేజీలు, రోడ్లు జలమయమయ్యాయి. భక్తులు వర్షంలో తడుస్తూ దర్శనానికి వెళ్లారు. ఘాట్లలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో టీటీడీ అధికారులు వాహనదారులను అప్రమత్తం చేసి పంపుతున్నారు. ఘాట్ రోడ్లలో భక్తుల్ని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ఆంక్షల్ని సడలిస్తామన్నారు టీటీడీ అధికారులు. మరోవైపు తిరుమల కొండల్లోని డ్యాముల్లో భారీగా వర్షపు నీరు చేరింది.
తుఫాన్ ప్రభావంతో తిరుమలలో జోరు వానలు కురిశాయి. జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి గోగర్భం, పాపవినాశనం జలాశయాలల్లో నీరు ఓవర్ ఫ్లో కావడంతో అధికారులు గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పసుపు ధార, కుమార ధార, ఆకాశగంగ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండి అవుట్ ఫ్లో అవుతున్నాయి. పసుపు ధార, కుమార ధార, ఆకాశగంగ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండి అవుట్ ఫ్లో అవుతున్నాయి. తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు శ్రీవారి అనుగ్రహంతో పూర్తిగా నిండాయని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీంతో ఏడాదికి సరిపడా తాగు నీళ్లకు ఇబ్బందులు లేవన్నారు. భూమన తిరుమలలో జలాశయాలను అధికారులతో వెళ్లి పరిశీలించారు. అయితే శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి నుంచే శ్రీవారి కరుణతో వర్షాలు మొదలయ్యాయి అన్నారు.