దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 10 కోట్ల మంది 5జీ సేవలను పొందుతున్నారని తెలిపింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల స్థూల ఆదాయం రూ.3 లక్షల కోట్లు దాటింది. మరోవైపు 2024 నాటికి దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 15 కోట్లకు చేరుతుందని నోకియా అంచనా వేసింది.