గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
గర్బాను మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు తెలిపారు. గర్బా నృత్యం యునెస్కో జాబితాలో చేరడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.