రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ‘మహిళా శక్తి’ పేరుతో ఆటోలు పంపిణీ చేయనుంది. మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఆటోలను ఇవ్వనుండగా.. ఇవాళ తొలివిడతగా 231 మందికి అందజేయనున్నారు.
ఆటో కొనుగోలు ఖర్చులో లబ్దిదారు మహిళ 10 శాతం భరిస్తే.. మిగతా 90 శాతాన్ని సెర్ప్ ద్వారా ప్రభుత్వం రుణంగా ఇవ్వనుంది. ఈ రుణానికి వడ్డీ ఉండదు. మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించాలి.