వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా ఏపీలో మరో రెండు రోజులపాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించొచ్చని పేర్కొంది. కాగా, మిచౌంగ్ తుపాను ప్రభావంతో బుధవారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో వర్షాలు కురిశాయి.