వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్తాన్లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొద్ది రోజులుగా కీలక ఉగ్రనేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు.
తాజాగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడు అద్నాన్ అహ్మద్‌ను కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో ఇంటి బయట ఉన్న అద్నాన్‌పై కాల్పులు జరిగాయి. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.