ఇంద్రకీలాద్రిపై దుర్గా మాతా ఆలయాన్ని సీఎం జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రూ. 216.05 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
అలాగే రూ.5.60 లక్షలతో చేపట్టిన మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తయిన అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు.