ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత ముఖ్యమైన ఈజిప్టులోని సూయజ్ కెనాల్లో బుధవారం ఓడ ప్రమాదానికి గురైంది. సింగపూర్ నుండి నెదర్లాండ్స్‌కు బయల్దేరిన కార్గో షిప్ సూయజ్ కెనాల్ గుండా ప్రయాణిస్తుండగా ఇస్మాలియా నగరానికి చేరుకోగానే దాని ముందు చుక్కాని విరిగిపోయింది.
దీంతో ఓడ అదుపు తప్పి మాన్సీ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓడ, వంతెనకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది ప్రస్తుతానికి తెలియదని సూయజ్ కెనాల్ అథారిటీ అధిపతి అడ్మిరల్ ఒసామా రబీ తెలిపారు.