మిచౌంగ్ తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఒకట్రెండు రోజుల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖ బృందాలు క్షేత్రా స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి.. డిసెంబర్ 3వ వారంలోగా నివేదకను రూపొందించనున్నాయి. ఈ నివేదిక ఆధారంగా ఈ నెలాఖరు/జనవరి తొలి వారంలో నష్ట పరిహారం డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.