కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త ఇంటి వారు అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతున్న సహానా (26)కు తన స్నేహితుడితో వివాహం నిశ్చయమైంది. అయితే అబ్బాయి కుటుంబం భారీగా కట్నాన్ని డిమాండ్ చేశారు. అధిక కట్నాన్ని ఇచ్చుకోలేమని సహానా కటుంబం చెప్పడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. దాంతో మనస్థాపానికి గురైన సహానా బలవన్మరణానికి పాల్పడింది.