జిల్లాల్లో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటివరకు పెండింగులో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలని అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్లను కోరారు. 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు, వందేళ్లు నిండిన వాటిని పునః పరిశీలించి వారంలోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎటువంటి పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ద కనబరచాలని సూచించారు.