టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైయస్ఆర్‌సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం అని తెలిపారు.