జాతీయ రహదారిపై నకిలీ టోల్‌ప్లాజాను నడుపుతున్న వ్యక్తులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్బి జిల్లాలో సుమారు ఏడాది నుంచి ఈ నకిలీ టోల్‌ప్లాజాను నిర్వహిస్తున్నారు.
బంబన్‌బోర్-కుచ్ నేషనల్ హైవేపై మోర్బి-వాంకనర్ ఊర్ల మధ్య వఘాసియా టోల్‌ప్లాజా ఉంది. పలుకుబడి ఉన్న ఓ నేత కొడుకుతో సహా ఐదుగురు కొత్తగా రోడ్డు వేసి టోల్‌ప్లాజా ఏర్పాటు చేశారు. దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు.