టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడీ దాఖలుచేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది.
గతంలో విచారణ సమయంలో ఇరు పక్షాలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇవాళ సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలడిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.