ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు.. రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందని..ఈ కష్టం.. ఈ నష్టం వర్ణణాతీతం అన్నారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారని.. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశామని.. ప్రతీ ఇంటికి రూ. 2,500 ఇచ్చామన్నారు.. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలోనే ఉంనది.. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి రూ. 2,500 ఇస్తారన్నారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదన్నారు.
స్వర్ణముఖి కాలువకు పడిన గండిని పరిశీలించానని.. స్వర్ణముఖిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు ముఖ్యమంత్రి జగన్. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని రూ.30 కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంలో అందరికీ మంచే జరుగుతుంది.. బాధితులకు సాయం అందకపోతే.. జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో 1902 కు ఫోన్ చేయాలని సూచించారు. అక్కడ నా కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామన్నారు.
వారంలో అందరికీ సాయం చేస్తామని.. నష్టపోయిన ప్రతీ రైతును ఆందుకుంటామన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమని.. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని.. తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. వారంలోగా సాయం అందుతుంది.. విద్యుత్ సరఫరాను కూడా యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటన అనంతరం సీఎం జగన్ నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లారు. అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ స్థానికులు, రైతుల్ని పరామర్శిస్తారు. అలాగే పొలాలను పరిశీలిస్తారు.. పంట నష్టంపై ఆరా తీయనున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకుంటారు.