వలేటివారిపాలెం మండలం మాలకొండ దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శనివారం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాలకొండ లో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. మిగిలిన రోజులలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి.